19 Jan 2008

My 1st Date



ఇంకా 3 కి.మి. ఉంది, 8 అవ్వడానికి ఇంక 5 నిమషాలు మాత్రమే ఉంది. బైక్ స్పీడ్ పెంచాను. టైం కి చేరగలనొ లేదొ. ఒకవేల లేట్ అయితే ..........

సరిగ్గా 2 రోజుల ముందు నా Engagement. Engagement తర్వాత తనని బయట కలుద్దాం అని నా Plan. So Engagement రోజునే అడగాలి ఆ తరవాత కుదరదు కదా. అయిన నాకు బయం ఎంటి అని నాలో దైర్యాన్ని బయటకు తోడి conversation start చెసా........ఇద్దరం అప్పుడు stage మీద showcase బోమ్మల లా కుర్చొని ఉన్నాం.

నేను: నీకు Cell ఉందా
తను : ఉంది
నేను: దానికి నుంబర్ కూడా ఉందా
తను : ఉంది ( నవ్వుతూ)
నేను: ఉంటె ఇవ్వచ్చు కదా, అడగాలా ( మనసులొ అందాం అనుకుని బయటకి అనేసాను)
తను : నవ్వుతూ నుంబర్ ఇచ్చింధి....

నేను: (ఏదో Mt Everest ఎక్కినవాడిలా ఫీల్ అయిపొయి) రేపు బయట కలుద్దామ అన్నాను ( actualగా నొటిలో నుండి గాలి తప్ప voice రావడం లెదు).అయినా నా మన్సులొని బావన, ఆవేదన, ఆలాపన అర్దం చేసుకొని అమ్మని అడిగి చెప్పుతాను అంది.

నేను: బాగ ఆలోచించుకొని రేపు మధ్యనానికి చెప్పినా చాలు వస్తాను అని

తరువాత రొజు నేనే call చెసను 12 కి. cell lift చెయ్యలేదు. ఒక అర గంట తరవత నన్నగారు callచేసారు bank నుండి. మీ మామగారు రాత్రికి శివాజి movieకి వెల్దాం అంటున్నారు రా. తయారు అవ్వి ఉండండి అన్నారు. నాకు అర్దం అయ్యింది, పాపం మా మామగారు DaTE అంటే అందరు కలిసి వెల్లాలి అనుకుంటున్నరు అనుకుంటా. So ఆ రోజు ఇంచక్కా happyగా అందరం కలిసి DATE కి వెల్లాం.

ఎమయిందో తెలియదు కాని, తరువాత రోజు మాకు permission దొరికింది బయట కలవడానికి. అధి కూడా మధ్యానం సినిమా, సాయంత్రం beach. ముందు doubt వచ్చిoది మెము ఇద్దరమేనా లెక అందరూనా అని...ఇంక అమ్మ గీతోపదేశం. జాగ్రత్తగా తేసుకు వెల్లు. నెమ్మది గా వెల్లు, బండి నడిపించుకొని వెల్లు అని...( అమ్మా నేను వెల్లెది డేట్ కి యుద్దానికి కాదు)


2 కి pickup చేసుకుంటాను అని చెప్పాను. సినిమాలో చూపించినట్టు ఒక Half Dozen బట్టలు మార్చి, ఎలా ఉన్నానో అని అమ్మని , తమ్ముడిని బుర్ర తిని final గ ఒక dress confirm చెసాను. నా బాద బరించలేక వాల్లు అన్ని dresslu ఆహ, ఓహో,అదరహో అనేవారు.

వాల్ల ఇంటికి వెల్లాను...తను ఇంకా తయారు అవుథుంది...ఈ లొగ వాల్ల cousin Anu (6-7 years) and aunty థొ మాత్లడుథున్న.....

aunty అన్నారు నువ్వు కూడా వెల్తావ అని Anuని......నాకు Tension start...ఈ twist ఎంటి దేవుడా అనుకున్నా......
Anu: వెల్లను ( నేను హమ్మయ్యా అనుకున్నా)
Aunty: వెల్థాను అన్నావు కదా......చూడు బావగారు కూడ రమ్మని అంటున్నరు..(నేను రమ్మని అంటున్నాన......లెదు లెదు......నేనె ఆ మాట అనలేదు......ఇప్పుడు మింగలెను, కక్కలెను...ఆ పరిస్తితి....)

అంతలొ తను వచ్చేసింది......Anu మనసు మార్చు కొనెలొపల బయట పడడం మంచిదని వెనక్కి చూడకుండ అక్కడ నుండి జుంప్......

AATA Movie చూడలేదు అంటె దానికి వెల్లాం. నేను already చూసెసాను. last 2 days బాగా అలసిపోవడం వల్ల అనుకుంటా సినిమా మధ్యలొ గురక తీస్తు పడుకుండి పోయాను. Date కి వెల్లి పడుకున్న వాల్లలొ మొదటి వాడిని నేనే అయ్యి ఉంటాను.

తరువాత గుడికి వెల్లాము. నేను ఏమి కొరుకున్నట్టు గుర్తులేదు కాని, తను మాత్రం వీడు డేట్ కి వచినప్పుడు నిద్రపోకుండ ఉండెటట్టు చూడు స్వామి అని కోరుకొని ఉండి ఉంటుంది.

ఇంక లాబం లెదు జరగిన అవమానం కి ప్రాయస్చిత్తం గా beach road మీద bike drive వెసి Tenneti parkకి తీసుకొని వెల్లాను......అక్కడ నా photographic skills థొ పడగొట్టేద్దాం అనుకొని ఇద్దరికి కలిపి photo నేనే తీయడానికి tryచేసాను.......కల్లు, ముక్కు, తల అన్ని చాల బాగ వచ్చాయి,కాని విడివిడి గా వచ్చాయి.....అన్ని కలిపి అతికించుకొవలసిన పరిస్తితి.......Return లొ మల్లి గుడికి తెసుకొని వెల్లమని అడిగింది తను.....వీడికి ఫొటొలు తీయడం వచ్చెటట్టు చూడమని ఆ దెవుడిని కోరుకోదానికి అనుకుంట......

ఇంక 2 minutes ఉంది అంతె 8 కి. 8 అవ్వక ముందే తనని drop చెయ్యాలి అది condition. అన్ని sides నుండి బలమయిన warnings వచ్చాయి 8 కి ముందు safe గా drop చెయ్యమని...అప్పుడే phone call. నాన్నగారు line లొ. drop చెసెసావు రా అని అడిగారు.మీరు phone పెట్టెస్తె drop చెసెస్తాను.

8 అయ్యింది...వాల్ల ఇల్లు వచ్చేసింధి....నా డేట్ ముగిసింది.....
కాని ఆ జ్ఞాపకాలు నా మదిలొ మధురానుబూతులు మిగిల్చ్చింది.

18 Jul 2007

Pelli Choopulu


టైం 6:00 అయింది...ఇంక గంట ఉంది phone కి.....ఏమి వినాల్సి వస్తుందొ అని గుండెల్లొ ఒకటె ధడ.....అందరం బిగపెట్టుకొని కుర్చున్నాం.......అంతా సాయంత్రం 4 కి మొదలు అయింది............

టైం 4:00 అయ్యింది....ఇంక 15 నిముషాలు ఉంది అనుకుంటున్నారు..... గత కొథ్థి రొజులు నుండి ఇంట్లొ ఇదే టొపిక్....అమ్మాయి బాగుంటుంది రా, తెలివి అయింది కూడా ( Maths olympiad lo prizes vachayata), చక్కగా మాట్లడుతుంది.....మా అందరకి బాగ నచ్చింది అని అమ్మ నాన్నగారు రామ కొటి లాగ ఒక కొటి సార్లు చెప్పి ఉంటారు.........ఇక తమ్ముడు అయితె .....స్క్రిప్ట్ తయారు చెసుకున్నావా రా....ఏమి మాట్లాడతావ్ రా..... నువ్వు నాకు నచ్చావ్ లొ వెంకటెష్ లాగ తింగరి వేషాలు వెయ్యకు అని వార్నింగ్ కూడ ఇచ్చాడు.......

టైం 4:15 అయ్యింది...... రూం నుండి ఎవరు వస్తున్నా ......మావిచిగురు సినిమా లో వదువు వస్తున్నది అని ఆశగ చూడడం......ఫైనల్ గా వదువు వచ్చింది...ఇప్పుడు చూడడానికి సిగ్గు.....అవును మీరు విన్నది కరెక్ట్. నెను కూడా సిగ్గు పడతాను అని అప్పుడె తెలిసింది.....ఫైనల్ గా కాలు తొ నేల మీద ముగ్గులు వెస్తూ మెల్లగా పయకి చూసా........మరూన్ కలర్ సారీ లొ ముట్టుకుంటె కందిపొథుంది అనేల ఒక అందమయిన అమ్మాయి ....... నవ్వితె మొకం కందిపొతుందేమొ అనేల ఉంది........ ఇధి కళ లేక నిజమా అని డౌబ్ట్ వస్తుంది కదా...నాకు కూడ వచ్చింది....టైం 4:15 AM కాదు అండి PM నే...అండ్ ఇది కల కాదు నిజమే.........

ఇక్కడ అయితె ఇబ్బంది గా ఉంటుంది రూం లొకి వెల్లి మాట్లాడుకొండి అన్నారు వాల్ల నాన్నగారు.......ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది...ఏమి మాట్లాడాలి....మనం ఏమి ప్రిపేర్ అవ్వలెదె......మొత్తానికి ధైర్యం గా ముందు అడుగు వేసి స్టార్ట్ చేసాను.....30 నిముషాలు దాటింది.... నాకు టైం తెలియలేదు....ఇంక చాలు రా బాబు అన్నట్టు ఆ అమ్మాయి చూపులు అనిపించాయి........సొ బయటకి వచ్చాం.....పరీక్షలు ఎలా రాసారు రా అని అడిగారు నాన్నగారు.....ఎలా రాసాను....హ్మ్....తెలియదు రిసల్ట్ వచ్చెవరకు......


రిసల్ట్ 7:00 కి డిక్లేర్ చేస్తాం అని decide అయ్యారు పెద్దాల్లు.... కారు లొ ఇంటికి వెల్తున్నాం.....అంతా నిశబ్దం..... ఆ నిశబ్దాన్ని చేదిస్తూ నాన్నగారు ఎలా ఉంది రా అమ్మాయి...నచ్చిందా అన్నారు.... "అమ్మాయి నచ్చేసింది ...ఆహ్వనమిచ్చెసింది...ఓ ముద్ద మందారం లా ముస్తాబు అయ్యింది" ..........ఇంక ఇంట్లొ అందరూ full happies...... అప్పుడే ఎమయింది ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా అన్నా.......నువ్వు నచ్చుతావ్ రా...నీకు ఏమి తక్కువ అన్నారు......నచ్చుతానా....అమ్మ చెప్పింది నిజమా లేక కన్న తల్లి ప్రేమా....... ఇంక 1 hour wait చెయ్యాలి..........


చిన్నపటి నుండి ఏ ఎక్షాం రిసల్ట్ కి ఇంత టెన్షన్ పడ లేదు......ఫైనల్ గ కాల్ చేసారు నాన్నగారు..... ఫొన్ లో ఏమి మాట్లాడుతున్నారో అని ఒక చెవి వేసి ఉంచాను..లేదు లేదు...రెండు చెవులు వేసి ఉంచాను......గ్రీన్ సిగ్నల్ అని ఏదొ విన పడింది....ఫొన్ లొ ఒకటే నవ్వులు.......1 ని ఎంగెగ్మెంట్ అంట.... 2 రోజులలో బోలెడు షాపింగ్ అండ్ బోలెడు పనులు అంట...ఇంక నాకు ఏమి వినపడటం లేదు.......... ఒక్కసారి పవన్ కల్యాన్ లా చెట్టు చాటుకి వెల్లి యాహో అని డేన్స్ చెయ్యాలి అనిపించింది.......ఇంతకీ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదూ ..........దీప(Deepa- Light in to my life)